: హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విజేత హాఫ్మన్ మృతి
హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత ఫిలిప్ సీమౌర్ హాఫ్మన్ కన్ను మూశాడు. న్యూయార్క్ నగరంలోని తన అపార్టుమెంటులో నిన్న (ఆదివారం) ఆయన విగతజీవిగా పడి ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. అనుమానాస్పదంగా మారిన ఫిలిప్ మరణంపై న్యూయార్క్ పోలీసు విభాగం దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపింది. ఫిలిప్ చనిపోవడానికి గల కారణాన్ని అటు ప్రధాన వైద్య పరిశీలకుడు నిర్ధారిస్తున్నట్లు పత్రిక పేర్కొంది. 2005 లో కాపోట్ జీవితచరిత్ర ఆధారంగా వచ్చిన చిత్రంలో నటించిన ఫిలిప్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు.