: సచిన్ కు భారత రత్న.. ఒక్క రోజులోనే!
సచిన్ టెండుల్కర్ కు భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుగా ఆలోచించి, తగిన కసరత్తు చేసిన తర్వాత ఖరారు చేయలేదు. కేవలం 24 గంటల్లో.. అదీ సచిన్ 200వ టెస్ట్ ఆడిన మరుసటి రోజు ఖరారు చేసేసింది. ఇస్తే బావుంటుంది కదా అనే ఆలోచన గతేడాది నవంబర్ 14న కేంద్రానికి వచ్చింది. అదే రోజు సచిన్ ముంబై వాంఖడే స్టేడియంలో చివరి టెస్ట్ ఆడుతున్నాడు. దాంతో సచిన్ వివరాలు పంపాలని ప్రధానమంత్రి కార్యాలయం క్రీడా శాఖను అదే రోజు మధ్యాహ్నం కోరింది. అక్కడి నుంచి వివరాలు అదే రోజు సాయంత్రం ప్రధానమంత్రి కార్యాలయానికి అందాయి. మరుసటి రోజు ప్రధాని ఓకే చెప్పేసి సచిన్ పేరును భారతరత్నకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతికి ఫైలు పంపించేశారు. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకోగలదో ఈ సంఘటన తెలియజేస్తోంది.