: వారి వద్ద అస్త్రాలేం లేవు.. విభజన తథ్యం: గండ్ర
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ లగడపాటి రాజగోపాల్ దగ్గర ఎలాంటి అస్త్రాలు లేవని, రాష్ట్ర విభజన తథ్యమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఢిల్లీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి దీక్ష చేసినా, లగడపాటి వేషాలు వేసినా విభజన ఆగదని అభిప్రాయపడ్డారు. తమ దగ్గర చాలా బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని లగడపాటి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.