: వైఎస్సార్సీపీపై సబ్బం హరి ఫైర్
కడపలోని ఇడుపాయలో జరిగిన వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భాష స్థాయికి తగ్గట్టుగా లేదని ఎంపీ సబ్బం హరి అన్నారు. రెండు రోజుల పాటు జరిపిన సమావేశాల్లో చివరి రోజు తనపై పార్టీ చేసిన వ్యాఖ్యలపై హరి మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం వారు ఏమైనా చేసుకోవచ్చు కానీ, తన గురించి మాట్లాడేటప్పుడు వైఎస్సార్సీపీ నోరు దగ్గర పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. 'వాళ్లు దొంగలు.. వీళ్లు దొంగలు' అని అనడం సరికాదన్నారు. ఆ పార్టీ నేతలకు ఉన్న సంస్కారం తనకు అంటగంటవద్దన్నారు. సిగ్గు లేదా? అని జగన్ అంటే.. సిగ్గు అనే పదమే సిగ్గు పడుతుందన్నారు. జగన్ ది లోపల విభజనవాదం, బయట సమైక్యవాదమని సబ్బం ఆరోపించారు. కాగా, పార్లమెంటులో 95 శాతం బిల్లులు మూజువాణి ఓటుతోనే అమోదం పొందుతాయన్నారు.