: మావోయిస్టు పార్టీ కీలక నేత అరెస్ట్
మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత చందు అలియాస్ అనిల్ కుమార్ ను ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. కల్పింకి అటవీ ప్రాంతంలో అతడిని పట్టుకున్నామని, అతడిపై రూ. 20 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. కానీ, చందును కొన్ని రోజుల క్రితమే ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అరెస్ట్ చూపించినట్లు తెలుస్తోంది.