: 90 శాతం బిల్లులు మూజువాణి ఓటుతోనే పాసవుతాయి: సీఎం
కొందరు మూజువాణి ఓటు అంటే తొండి అన్నారని... ప్రజాస్వామ్యంలో 80 నుంచి 90 శాతం బిల్లులు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందుతాయని ముఖ్యమంత్రి కిరణ్ చెప్పారు. ఇటీవల పార్లమెంటులో పాసైన ఆహార భద్రత, లోక్ పాల్ బిల్లులు మూజువాణి ఓటుతోనే ఆమోదం పొందాయని తెలిపారు. అలాగే, గతంలో ఏర్పడిన రాష్ట్రాలు కూడా మూజువాణి ఓటుతోనే ఏర్పాటయ్యాయని చెప్పారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో తీర్మానం వీగిపోయాక... మన దేశంలో ఏ రాష్ట్రం ఏర్పడలేదని ఆయన చెప్పారు. పదవీ కాంక్షతో సమైక్యవాదులు విభజనవాదులయ్యారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం తమ విధానాలు, పద్దతులు మార్చుకుంటున్నారని విమర్శించారు.