: తెలంగాణకు బీజేపీ కట్టుబడి ఉంది: కిషన్ రెడ్డి


తెలంగాణకు బీజేపీ కట్టుబడి ఉందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. పార్టమెంటులో టీబిల్లు ఆమోదం పొందేలా చూస్తామని స్పష్టం చేశారు. అయితే సీమాంధ్ర ప్రాంత సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన అవసరముందని చెప్పారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం అవుతుందని చెప్పారు. ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తోందని అన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను వద్దనుకుంటున్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News