: గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్న బాబు పాదయాత్ర
'వస్తున్నా... మీ కోసం' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేబట్టిన సుదీర్ఘ పాదయాత్ర నేడు గుంటూరు జిల్లాలోకి ప్రవేశిస్తోంది. ప్రకాశం బ్యారేజీ మీదుగా ఈ ఉదయం చంద్రబాబు జిల్లాలోకి అడుగుపెడతారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. పన్నెండు రోజుల పాటు 150 కిలోమీటర్ల మేర జిల్లాలో ఈ పాదయాత్ర సాగేలా ప్లాన్ చేశారు. చంద్రబాబు రాకతో జిల్లాలోని తెలుగు దేశం శ్రేణుల్లో మరింత ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు.