: త్వరలోనే 'తెలుగు' మంత్రిత్వ శాఖ: బుద్ధ ప్రసాద్


తెలుగుకు పునరుజ్జీవం కల్పించడమే లక్ష్యంగా త్వరలోనే తెలుగు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ వెల్లడించారు. బెంగళూరులో నిన్న జరిగిన తెలుగు విజ్ఞాన సమితి వజ్రోత్సవాలకు అతిథిగా బుద్ధ ప్రసాద్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతనంగా ఏర్పాటు చేయబోయే తెలుగు మంత్రిత్వ శాఖ.. రాష్ట్రం వెలుపల ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష వికాసానికి తోడ్పడుతుందని ఆయన వెల్లడించారు. కాగా, ఇంతకుముందు రద్దయిన సాహిత్య, సంగీత, నాటక అకాడమీలకు మంచి రోజులు రానున్నాయని మండలి తెలిపారు.

వాటిని తిరిగి ప్రారంభించేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పచ్చ జెండా ఊపారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బుద్ధ ప్రసాద్ తో పాటు సినీ నటులు కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, షావుకారు జానకి, జయంతి, హేమా చౌదరి తదితరులు పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News