: కేసీఆర్ తిరిగొస్తారా? లేక ఢిల్లీలోనే ఉండిపోతారా? అనేది తేలిపోతుంది: మంత్రి గంటా


రాష్ట్రపతికి బిల్లు చేరిన తర్వాత కోర్టుకు వెళ్లే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం తరఫున కోర్టుకు వెళ్లాలా? లేక సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ పిల్ దాఖలు చేయాలా? అనే విషయంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. టీబిల్లు గెలిచే అవకాశం లేదని న్యాయకోవిదులు కూడా చెబుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా రాజ్యసభ బరిలో దిగిన ఆదాలకు మద్దతిచ్చే విషయంపై మరో రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ రోజు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం తరఫునే ఢిల్లీ నుంచి తిరిగి వస్తానన్న కేసీఆర్ గురించి మాట్లాడుతూ, ఆయన తిరిగి వస్తారో లేక ఢిల్లీలోనే ఉండిపోతారో తెలుస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News