: భారీ సెక్యూరిటీ మధ్య నేడు మోడీ మీరట్ సభ
బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేడు ఉత్తరప్రదేశ్ మీరట్ లో జరగనున్న భారీ బహిరంగసభకు హాజరుకానున్నారు. ముజఫర్ నగర్ మత ఘర్షణల నేపథ్యంలో, మోడీ సభకు భారీ సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఇద్దరు ఎస్పీలు, 10 మంది అడిషనల్ ఎస్పీలు, 20 మంది డిప్యూటీ ఎస్పీలు, 12 మంది ఇన్ స్పెక్టర్లు, 150 మంది సబ్-ఇన్ స్పెక్టర్లు, 450 మంది కానిస్టేబుళ్లు, 22 మంది ట్రాఫిక్ సబ్-ఇన్ స్పెక్టర్లతో పాటు 10 కంపెనీల సాయుధ బలగాలు సభావేదిక వద్ద పహారా కాస్తున్నారు.