: ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కేసీఆర్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ బిల్లుకు మద్దతు గూడకట్టే పనిలో పడ్డారు. ఇందుకోసం ఆయన ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ పూర్తవడంతో కేసీఆర్ పార్టీ నేతలతో కలిసి శుక్రవారం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉదయం ఢిల్లీలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ ను కేసీఆర్ కలుసుకున్నారు. ఆయన వెంట పార్టీ నేతల బృందం కూడా ఉంది. తెలంగాణ బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇవ్వాలని కేసీఆర్ లాలూను అభ్యర్థించారు. లోక్ జనశక్తి అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ను మధ్యాహ్నం 12.30 గంటలకు, జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ ను సాయంత్రం 6 గంటలకు కలుసుకోనున్నారు.