: కర్ణాటకలో భద్రాచల సీతారాముల కల్యాణం


కర్ణాటక రాష్ట్రంలోని శ్రీనివాసపురంలో ఆదివారం భద్రాచల సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రాద్రి దేవాలయానికి చెందిన రామరథం, శ్రీ సీతారాముల ఉత్సవ విగ్రహాలు శనివారం సాయంత్రానికి శ్రీనివాసపురం చేరుకున్నాయి. భద్రాచల సీతారాముల కల్యాణాలు ఇప్పటివరకూ మన రాష్ట్రంలోనే జరుగగా, తొలిసారి కర్ణాటక రాష్ట్రం పోలార్ జిల్లా శ్రీనివాసపురంలో పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. కల్యాణ వేదికను అత్యంత విశాలంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. శనివారం సాయంత్రమే శ్రీనివాసపుర వీధులలో వేలాది భక్తులు వెంటరాగా సీతారామచంద్ర స్వామి వారి ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. ఇక, రేపు (ఆదివారం) కన్నడవాసుల కోసం సీతారామకల్యాణాన్ని కన్నుల పండువగా జరుపనున్నారు.

  • Loading...

More Telugu News