: ధావన్ కు గాయం.. ఆఖరి టెస్టుకు డౌటే!
మొహాలీ టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు కడగండ్లు మిగిల్చిన విధ్వంసక ఓపెనర్ శిఖర్ ధావన్ కు గాయమైంది. చివరి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తున్న సందర్భంగా ధావన్ చేతి వేళ్ళకు గాయమైనట్టు సమాచారం. ఎక్స్ రేలో ఎముకలో ఎలాంటి పగుళ్ళూ లేవని స్పష్టం కావడంతో భారత శిబిరం ఊపిరిపీల్చుకుంది. అయితే, గాయం తీవ్రత దృష్ట్యా ధావన్ ఈ నెల 22 న మొదలయ్యే చివరి టెస్టుకు అందుబాటులో ఉండేది అనుమానమే అని జట్టు మేనేజ్ మెంట్ సూచనప్రాయంగా వెల్లడించింది.