: శక్తి యుక్తులు ఉపయోగిస్తాం..బిల్లును అడ్డుకుంటాం: ఆశోక్ బాబు
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు శక్తియుక్తులను ఉపయోగిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇంకా విభజన అంటే కనుక తాము సుప్రీంకోర్టుకు వెళ్లే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. ఢిల్లీలో విభజనకు వ్యతిరేకంగా ఎవరు దీక్ష చేసినా తాము మద్దతిచ్చేందుకు సిద్ధమని తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉన్నవారి మద్దతు కూడగడతామని ఆయన చెప్పారు. ఎల్లుండి నిర్వహించే ఏపీఎన్జీవోల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుని, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని అశోక్ బాబు స్పష్టం చేశారు.