: ఖమ్మంలో మహిళా ఓటర్లే ముందున్నారు


వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఖమ్మం జిల్లా వాసులు ముందుకొచ్చారు. అన్ని ప్రక్రియల అనంతరం అనేక మార్పుచేర్పులతో జిల్లా ఓటర్ల తుది జాబితా సిద్ధమయింది. ఈ జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం 19,71,797 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 9,75,432 మంది ఉండగా, స్త్రీలు 9,96,254 మంది ఉన్నారు. అంటే మహిళా ఓటర్లు 20,822 మంది అధికంగా ఉన్నారు. శుక్రవారం నాటికి గడువు ముగియడంతో జిల్లా కలెక్టర్ ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘానికి పంపారు.

ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 14,07,974 మంది నమోదయ్యారు. మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో (పినపాక, భద్రాచలం, ఇల్లెందు) కలిపి 5,63,823 మంది ఓటర్లు ఉన్నారు. పినపాక నియోజకవర్గం మినహా అన్నిచోట్లా మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల జాతకాలను నిర్ణయిస్తారన్నమాట.

  • Loading...

More Telugu News