: పోస్టర్ల కలకలం.. టీడీపీ పోస్టర్లపై మంత్రి గల్లా అరుణ
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొట్టాలలో వెలసిన పోస్టర్లు, ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. టీడీపీ ఎంపీ శివప్రసాద్ సొంత ఊర్లో ఏర్పాటు చేసిన టీడీపీ పోస్టర్లపై ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి గల్లా అరుణ ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ రోజు కొట్టాలలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాలకు మంత్రి అరుణ హాజరయ్యారు. ఈ కార్యక్రమాల్లో ఆమెతో పాటు ఎంపీ శివప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ పోస్టర్లు వెలిశాయి. మంత్రి కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు జిల్లా నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తారనే వార్తల నేపథ్యంలో, ఈ ఫ్లెక్సీల ఉదంతం సంచలనంగా మారింది.