: కేంద్ర మంత్రి కావూరికి తెలంగాణ సెగ


వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు తెలంగాణ సెగ తగిలింది. జనగామలో ఆటోమేటిక్ సిల్క్ రీలింగ్ యూనిట్ ప్రారంభోత్సవానికి హాజరైన కావూరిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తెలంగాణకు మద్దతు తెలపాల్సిందిగా నినాదాలు చేశారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసేలా ప్రయత్నించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. కావూరి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.

  • Loading...

More Telugu News