: తెలంగాణ నడిబొడ్డున తెలంగాణకు వెన్నుపోటు పొడిచారు: సీహెచ్ విద్యాసాగర్ రావు
శాసనసభలో సీఎం కిరణ్, స్పీకర్ నాదెండ్ల మనోహర్ ల చర్యలు చాలా విచిత్రంగా ఉన్నాయని రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణకు నడిబొడ్డున ఉన్న శాసనసభలో తెలంగాణకు వెన్నుపోటు పొడవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తన చర్యలతో చరిత్ర హీనుడిగా మిగిలిపోయారని చెప్పారు. ఈ రోజు ఆయన బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో తీర్మానం తిరస్కారానికి గురవుతుందన్న విషయాన్ని దిగ్విజయ్ సింగ్ ఎప్పుడో చెప్పారని తెలిపారు. అయినా, పార్లమెంటులో టీబిల్లు ఆమోదం పొందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బిల్లు ఆమోదం పొందడానికి బీజేపీ మద్దతు ఇస్తుందని తెలిపారు.