: అప్పుడు ఓకే చెప్పిన సీఎం.. ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారు: డిప్యూటీ సీఎం


ముఖ్యమంత్రి కిరణ్ పై డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ మరోసారి విరుచుకుపడ్డారు. ఒక ప్రాంత మనోభావాలే ముఖ్యమనుకుంటే... ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ సభలో తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని ప్రకటించిన ముఖ్యమంత్రి... ఇప్పుడెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు పూర్తయిందని... ఇంకెవరూ దాన్ని ఆపలేరని చెప్పారు. సీమాంధ్రులను మోసం చేయడానికే ఆ ప్రాంత నేతలు సమైక్యవాదాన్ని లేవనెత్తారని ఆరోపించారు. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని తెలిపారు. 2004 మేనిఫెస్టోలో తెలంగాణ అంశాన్ని పెట్టినప్పుడు... కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదని అన్నారు. విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం నేత సత్యప్రసాద్ ను డిప్యూటీ సీఎం ఈ రోజు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

  • Loading...

More Telugu News