: బీజేపీ సహకరిస్తే తెలంగాణ తథ్యం: ముఖేష్ గౌడ్
పార్లమెంటులో భారతీయ జనతా పార్టీ సహకరిస్తే కచ్చితంగా తెలంగాణ వస్తుందని మంత్రి ముఖేష్ గౌడ్ అన్నారు. ఈ ఉదయం ఆయన విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ నిర్ణయం విషయంలో పార్టీ అధిష్ఠానాన్ని ముఖ్యమంత్రి ధిక్కరించారనడం సరికాదన్నారు. తన ప్రాంత ప్రజల మనోభావాలకు తగ్గట్టుగానే సీఎం వ్యవహరించారని పేర్కొన్నారు.