: కోహ్లీ @ రూ.100 కోట్ల బ్రాండ్ వాల్యూ


టీమిండియా బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు ధనార్జనలోనూ ఘనాపాఠీయే. తన సమయోచిత బ్యాటింగ్ ద్వారా యువతకు ఆరాధ్యుడైన ఈ ఢిల్లీ యువ కెరటం.. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలతో దేశ వ్యాప్తంగా పెద్ద, చిన్నతేడా లేకుండా అందరి నోళ్లలోనూ నానుతున్నాడు.

ప్రస్తుతం కోహ్లీ వాణిజ్య ఒప్పందాల విలువ రూ. 100 కోట్లకు చేరుకుందని తెలుస్తోంది. భారత క్రికెట్లో వంద కోట్ల క్లబ్ లో ఉన్నది ఇప్పటి వరకు సచిన్, ధోనీ మాత్రమే. కోహ్లీ వీరిద్దరినీ మించడం ఖాయమని వ్యాపార వర్గాల అభిప్రాయం. గత రెండేళ్లుగా టీమిండియా బ్యాటింగ్ కు వెన్నెముకగా మారిన కోహ్లీ.. ప్రస్తుతం 15కు పైగా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడట.

ఒక్కో ప్రకటనకు ఈ డైనమిక్ బ్యాట్స్ మన్ రూ. 3 కోట్లు మాత్రమే వసూలు చేస్తాడని సమాచారం. తాజాగా కోహ్లీ ఖాతాలో సింథాల్ డియో, నెస్లే మంచ్ వంటి బడా బ్రాండ్లు కూడా చేరాయట.  

  • Loading...

More Telugu News