: నెలాఖరుకల్లా వీఆర్వో, వీఆర్ఏ నియామకాలు పూర్తి: రఘువీరా


ఫిబ్రవరి 2న జరిగే వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ వీఆర్వోలకు 13.13 లక్షలు, వీఆర్ఏలకు 62 వేల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 20న ప్రకటిస్తామని వెల్లడించారు. నెలాఖరు నాటికి నియామకాలు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నియామకాలు పారదర్శకంగా జరుపుతామని, దళారులను నమ్మి అనవసరంగా మోసపోవద్దని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News