: సీఎం ఇచ్చిన నోటీసు చెల్లదు: శ్రీధర్ బాబు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లును తిరస్కరిస్తున్నామంటూ ఇచ్చిన నోటీసు చెల్లదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్ బాబు తెలిపారు. స్పీకర్ ను కలిసిన సందర్భంగా హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆ నోటీసు సభా సంప్రదాయాలకు వ్యతిరేకమన్నారు. బిల్లును రానున్న 15 రోజుల్లోగా ఆమోదించేందుకు యూపీఏ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి నోటీసును 10 రోజుల ముందు ఇవ్వాలనీ, అసలు మంత్రులతో చర్చించకుండా ఇచ్చిన నోటీసు చెల్లదని స్పీకర్ కు తెలిపామనీ శ్రీధర్ బాబు చెప్పారు.

  • Loading...

More Telugu News