: మేఘాలయలో ఎమ్మెల్యే సోదరుడి కిడ్నాప్


మేఘాలయ రాష్ట్రంలోని బాగ్ మరా నియోజకవర్గ ఎమ్మెల్యే శామ్యూల్ సంగ్మా సోదరుడు నాగ సంగ్మాను నలుగురు వ్యక్తులు అపహరించుకుపోయారు. గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ (జీఎన్ఎల్ఏ) సంస్థకు చెందిన నలుగురు తీవ్రవాదులు నిన్న సాయంత్రం భారత్, బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని గాస్ ఉపారాలోని తన నివాసంలో ఉన్న నాగ సంగ్మాను అపహరించుకుపోయారు. కిడ్నాపర్ల నుంచి డిమాండ్స్ తో కూడిన ఫోన్ ఇప్పటి వరకు రాలేదు. అతనిని దేశం దాటించే అవకాశం ఉందన్న అనుమానంతో సరిహద్దుల వెంబడి భద్రత పెంచారు.

శామ్యూల్ సంగ్మా బొగ్గు, టింబర్ వ్యాపారం చేస్తున్నారు. దీంతో ఆయనను గతంలో తీవ్రవాదులు డబ్బు డిమాండ్ చేస్తూ ఫోన్ చేశారు. దానిని పట్టించుకోకపోవడంతో ఆయన సోదరుడ్ని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నాగ సంగ్మా కోసం గాలింపు తీవ్రం చేశారు.

  • Loading...

More Telugu News