: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీకి గాయాలు
బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడ్డాడు. 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' ఫేం అర్షద్ వార్సి 'ద లెజెండ్ ఆఫ్ మైకేల్ మిశ్రా' సినిమా షూటింగులో పాల్గొంటుండగా తలకు బలమైన గాయమైంది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తను కోలుకుంటున్నానని, అభిమానుల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు అని ట్విట్టర్లో తెలిపాడు. తాను చాలా అదృష్టవంతుణ్ణని, తలకు తగిలిన బలమైన గాయం నుంచి కోలుకుంటున్నానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి అర్షద్ వార్సి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.