: ఫిబ్రవరి చివరికల్లా వైఎస్సార్సీపీ ఖాళీ: యనమల


జగన్ నియంత అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, జగన్ ప్రజాస్వామ్యవాది కాదని అన్నారు. అధికారం కోసం తననే నమ్ముకున్న వారిని సైతం బలిచేయడం జగన్ కు అలవాటని, విభజనకు జగన్ సహకరిస్తున్నాడన్న విషయాన్ని ఆ పార్టీ ఆడుతున్న నాటకాలే తెలుపుతున్నాయని యనమల విమర్శించారు. ఫిబ్రవరి చివరికల్లా వైఎస్సార్సీపీ ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు.

  • Loading...

More Telugu News