: ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలంలో దుర్ఘటన
ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం తలకొండపాడు వద్ద దుర్ఘటన జరిగింది. పొగాకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ విద్యుదాఘాతానికి గురయింది. దాంతో, ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న 15 మంది కూలీలు ప్రాణాలతో పోరాడుతున్నట్లు సమాచారం. వారిలో పలువురు మరణించినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది.