: పాన్ కార్డుకు పాత నిబంధనలే వర్తిస్తాయి
పాన్ కార్డు కోసం ప్రవేశపెట్టిన తాజా నిబంధనలను కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఇప్పుడు అమలులో ఉన్న పాత నిబంధనలే వర్తిస్తాయని ఆర్థిక శాఖ ప్రకటించింది. పాన్ కార్డు తీసుకునే వారు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఒరిజినల్ పత్రాలను సమర్పించాలని కొన్ని రోజుల క్రితం ఆర్థిక శాఖ కొత్త నిబంధనలు విధించిన విషయం విదితమే. ఈ మేరకు తదుపరి ఉత్తర్వులొచ్చేవరకు తాజా నిబంధనలను అమలు చేయవద్దని అన్ని పాన్ సర్వీసు సెంటర్లకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సర్క్యులర్ ను పంపించింది. కానీ ఇందుకు గల కారణాలను మాత్రం ఆర్థిక శాఖ వెల్లడించలేదు.