: రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ నాటకమాడుతోంది: చంద్రబాబు


హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ కలిసి కుట్రపన్ని రాజకీయాలు చేస్తున్నాయని ఆయన చెప్పారు. విభజన అంశాన్ని కాంగ్రెస్ నాటకంగా మార్చిందని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానమే ప్రోత్సహిస్తోందని చంద్రబాబు చెప్పారు. ఈ నాటకంలో వైఎస్సార్సీపీ సభ్యులు పాత్రధారులని ఆయన అన్నారు. విభజన విషయంలో వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు మాట మార్చి మోసానికి పాల్పడిందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News