: జుట్టు రాలుతోందా ... అయితే, ఇలా ట్రై చేయండి!


టీనేజ్ అబ్బాయిలకీ, అమ్మాయిలకీ కూడా ఈవేళ ప్రధాన సమస్య జుట్టు రాలిపోవడం!
పొద్దున్నే దువ్వుకుంటే గుప్పెడు జుట్టు చేతిలోకి వస్తుంది. ఆ వయసులో అందాన్నిచ్చేది జుట్టే కాబట్టి, ఈ సమస్యతో బాధపడేవారు నలుగురిలోకి రావడానికి సిగ్గుపడిపోతుంటారు.
అయితే, ఇలా జుట్టు ఊడిపోవడానికి చాలా కారణాలుంటాయి. థైరాయిడ్ సమస్య, చర్మ వ్యాధి, చుండ్రు వంటివి లేనప్పుడు జుట్టు రాలుతోందంటే కనుక అది ప్రోటీన్ లోపమని మనం గ్రహించాలి.

అందుకే, ప్రోటీన్ దండిగా వుండే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. సోయాబీన్స్, పాల ఉత్పత్తులు, కాయగూరలు, బీన్స్, మాంసాహారం పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.
జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వంటివి కూడా తింటూ వుండాలి.
ఇలా ప్రోటీన్ ఫుడ్డు గనుక మన ఆహారంలో కచ్చితంగా ఉండేలా చూసుకుంటే జుట్టుకి మంచి పోషకాలు లభిస్తాయి.
దాంతో, హెయిర్ ఫాలింగ్ (జుట్టు రాలడం) సమస్యను అధిగమించవచ్చు. కాబట్టి, మీలో ఈ సమస్య వుంటే ఒక్కసారి ట్రై చేయండి!

  • Loading...

More Telugu News