: సరైన సమయంలో ఢిల్లీ వెళతాం: ధూళిపాళ్ల నరేంద్ర
విభజన బిల్లుపై మాట్లాడేందుకు సరైన సమయంలో ఢిల్లీ వెళతామని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర చెప్పారు. అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ఎలా ప్రవేశపెడతారని రాష్ట్రపతిని అడుగుతామని చెప్పారు. ఎంపీలు, కేంద్రమంత్రులపై ఒత్తిడి తెచ్చేలా తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు.