: కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ కాదు తృణమూల్ కాంగ్రెస్ : మమతా బెనర్జీ


కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ కాదని తృణమూల్ కాంగ్రెస్ అని ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తెలిపారు. కోల్ కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన భారీ ర్యాలీ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీలకు తృణమూల్ కాంగ్రెస్ కొత్త ప్రత్యామ్నాయంగా మారుతుందని అన్నారు. అల్లర్లకు మద్దతిచ్చే ప్రభుత్వం తమకు వద్దని, దేశంలో మార్పు తెచ్చే ప్రభుత్వమే కావాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రాలను బలోపేతం చేసేందుకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్న మమత, రానున్న ఎన్నికల తరువాత బెంగాల్ సరిహద్దులు దాటి తాము క్రియాశీలక పాత్ర పోషిస్తామన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి తాను వెళ్తానని ఆమె స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News