: డాక్టర్ డెడికేషన్.. ఆపరేషన్ చేసేందుకు 10 కిలోమీటర్ల నడక
వైద్యుడిని దేవుడితో ఎందుకు పోలుస్తారో తెలిపే ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. తాజాగా అమెరికాలో భారీ మంచు కురుస్తున్న సంగతి తెలిసిందే. చలి ధాటికి మనుషులు బయటికి వచ్చేందుకే తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ట్రినిటీ వైద్య కేంద్రంలో ఉన్న ఏకైక బ్రెయిన్ సర్జన్ డాక్టర్ జెంకో రింకీ ఓ రోగి ప్రాణాలు కాపాడేందుకు 10 కిలోమీటర్లు మంచులో నడచి వెళ్లారు. విపరీతంగా కురుస్తున్న మంచుతో వాహనాలు తిరిగే పరిస్థితి లేని టైంలో జెంకో రింకీ నడిచి వెళ్లి రోగికి ఆపరేషన్ చేసి ప్రాణం పోశారు. ఆపరేషన్ ఇంకాస్త ఆలస్యమైతే రోగి మృత్యువాత పడేవాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.