: దుబాయ్ విమానాల గమ్యం ఇండియానే!


ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీ విమానాశ్రయం దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడి నుంచి అత్యధిక ప్రయాణికులు ఎక్కడికి వెళ్తారో ఊహించండి... ఇంకెక్కడికి, భారతదేశానికే! 2013లో దుబాయ్ నుంచి 84 లక్షల మంది ప్రయాణికులు భారత దేశానికి వచ్చారు. 2012లో వీరి సంఖ్య 73.47 లక్షలు. ఇలా ఏటికేడు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

భారత్ తరువాతి స్థానంలో బ్రిటన్ నిలిచింది. దుబాయ్ నుంచి ఆ దేశానికి గతేడాది 50.99 లక్షల మంది వెళ్లారు. తృతీయ స్థానంలో సౌదీ అరేబియా నిలిచింది. ఈ దేశానికి గతేడాది 48.25 లక్షల మంది వెళ్లారు. దీనిపై దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమానాశ్రయం నుంచి వార్షిక ప్రయాణికుల ట్రాఫిక్ 6.64 కోట్లకు చేరుకుందని ఎయిర్ పోర్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాల్ గ్రిఫిత్స్ తెలిపారు.

  • Loading...

More Telugu News