: బిల్లును వెనక్కి పంపినా నష్టం లేదు: కోదండరామ్
తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీలో ఓడిపోతే నష్టమేమీ లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని ఆయన చెప్పారు. శాసనసభలో వైఖరి ప్రజలను ఆవేశానికి గురి చేసిందని, అయినా తెలంగాణ ప్రజలు ఆందోళనకు గురి కావద్దని ఆయన కోరారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో జేఏసీ పాత్ర కూడా ఉంటుందని ఆయన అన్నారు.