: టైం కావాలన్నాం.. తిరస్కరించాం: ఆనం


విభజన బిల్లుపై మరింత చర్చ జరగాల్సి ఉందని, శాసనసభ్యుల అభిప్రాయాలు పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే మరింత అదనపు సమయం కావాలని కోరామని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తీర్మానం గురించి బీఏసీ సమావేశంలో అన్ని పార్టీలకు చెప్పడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో స్పీకర్ సీఎం తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు సభలో ఆమోదం తెలుపుతూ ఎక్కువ గొంతులు సమాధానం చెప్పాయని ఆయన తెలిపారు.

అయితే శాసనసభలో సంఖ్యను గణించే అవకాశం లేకపోవడంతో, మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదిస్తూ, విభజన బిల్లును తిరస్కరించారని ఆనం గుర్తు చేశారు. బిల్లును తిరస్కరించి వెనక్కి పంపామని ఆయన తెలిపారు. స్పష్టంగా, రాజ్యాంగబద్ధంగా నిబంధనలను అనుసరిస్తూ విభజన బిల్లును తిరస్కరించామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఎవరికీ సందేహాలు వద్దని, బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ తిరస్కరించిందని మంత్రి ఆనం స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News