: సీఎం తీర్మానం.. ప్రభుత్వ తీర్మానం కాదు: శ్రీధర్ బాబు


రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలో ముఖ్యమంత్రి ఇచ్చిన తీర్మానం ప్రభుత్వ తీర్మానం కాదని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే సీఎం తీర్మానం నోటీసు ఇచ్చారని చెప్పారు. ఆయన తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని స్పీకర్ ను కోరామని.. అయితే, బిల్లును ఆపేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పేర్కొన్నారు. కాగా, ఆర్టికల్-3 ప్రకారం పంపిన బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే చెప్పాలన్నారు.

  • Loading...

More Telugu News