: టీమిండియా టార్గెట్ 133.. ప్రస్తుతం 30/0


మొహాలీ టెస్టులో భారత్ గెలుపు బాటలో పయనిస్తోంది. మ్యాచ్ కు తొలి రోజు వర్షార్పణం అయినా, చక్కని ప్రణాళికతో ఆడిన ఆతిథ్య జట్టు.. ఆసీస్ పై సిరీస్ విజయానికి రంగం సిద్ధం చేసుకుంది. పేసర్ భువనేశ్వర్ కు తోడు స్పిన్నర్లు అశ్విన్, ఓజా, జడేజా కలిసికట్టుగా రాణించడంతో కంగారూలు రెండో ఇన్నింగ్స్ లో 223 పరుగులకు పరిమితమయ్యారు.

దీంతో, భారత్ విజయలక్ష్యం 133 పరుగులు కాగా, ప్రస్తుతం వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. ఓపెనర్ గా బరిలో దిగిన పుజారా 10 పరుగులతోనూ, రెగ్యులర్ ఓపెనర్ విజయ్ 19 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. కాగా, ఆటకు నేడు చివరిరోజు. ఈ మ్యాచ్ లో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 408 పరుగులు చేయగా, భారత్ 499 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. 

  • Loading...

More Telugu News