: ప్రస్తుత పరిస్థితికి కిరణ్, చంద్రబాబులే కారణం: విజయమ్మ


యుద్ధవిమానంలో వచ్చిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రికి 17 గంటలు పట్టిందని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విమర్శించారు. బిల్లు వచ్చిన రోజున ఆయన కనీసం దాన్ని చూడలేదని, ఆరోగ్యం బాగాలేదని తప్పించుకున్నారని ఆరోపించారు. రోడ్ మ్యాప్ ఇచ్చి తమ రాజీనామాలను ముఖ్యమంత్రి ఆపారని అన్నారు. బిల్లు వచ్చినప్పుడే అందులోని లోపాలను సీఎం కిరణ్ ఎందుకు ఎత్తి చూపలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబులే కారణమని విమర్శించారు.

  • Loading...

More Telugu News