: గుంటూరులో మంత్రుల ఇళ్ల ఎదుట మౌనదీక్షలు
సమైక్యాంధ్రకు మద్దతుగా.. మంత్రుల, ఎమ్మెల్యేల నివాసాల ఎదుట ఈరోజు (గురువారం) గుంటూరు జిల్లా ఇంజనీరింగ్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు మౌన దీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు గుంటూరులో ప్రారంభమైన ఈ దీక్షలో భాగంగా స్థానిక మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్, కన్నా లక్ష్మీనారాయణ, జేడీ శీలం, రాయపాటి సాంబశివరావు, తెనాలిలో సభాపతి మనోహర్ ఇళ్ల ఎదుట మౌన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. తమ కార్యాచరణలో భాగంగా జేఏసీ శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి క్రీడా మైదానంలో వేలాది మంది విద్యార్థులతో జన జాగరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.