: 25 కోట్లకు చేరుకుంటున్న భారత నెటిజన్ల సంఖ్య
స్మార్ట్ ఫోన్లలో నెట్ జెట్ వేగంతో దూసుకుపోతోంది. దేశంలో నెటిజన్ల సంఖ్య శరవేగంగా దూసుకుపోవడంలో స్మార్ట్ ఫోన్లదే ఇప్పుడు ప్రధాన పాత్ర. ఈ ఏడాది జూన్ నాటికి దేశీయ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 24.3 కోట్లకు చేరుతుందని భారతీయ ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ అంచనా. గతేడాది జూన్ కు ఈ సంఖ్య 19 కోట్లుగానే ఉంది. అంటే ఏడాదిలో ఆరు కోట్ల నెటిజన్లు పెరిగారంటే సాధారణ విషయమేమీ కాదు. జూన్ నాటికి మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో అగ్రభాగం మొబైల్ నెటిజన్లదే. వారి సంఖ్య 18.5 కోట్లుగా ఉంటుందని అసోసియేషన్ తెలిపింది.