: ముగ్గురు బాబులకూ సీమాంధ్ర ప్రజలపై ప్రేమ లేదు: ఈటెల
సీమాంధ్ర నాయకులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. ముగ్గురు బాబులు... కిరణ్ బాబు, చంద్రబాబు, జగన్ బాబులకు సీమాంధ్ర ప్రజలపై ప్రేమ లేదని... వారికి రానున్న ఎన్నికల్లో ఓట్లు, సీట్లే కావాలని అన్నారు. సీమాంధ్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. వీరంతా రాజ్యాంగాన్ని కూడా వ్యతిరేకిస్తూ, బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని... ఈ విషయాన్ని స్పీకర్ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు.