: ఇందిరా గాంధీ మరణానంతర అల్లర్లపై 'సిట్' వేయాలి: కేజ్రీవాల్


ఇందిరా గాంధీ మరణానంతరం 1984లో ఢిల్లీలో చోటు చేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి దర్యాప్తు చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయంపై లెఫ్టినెంట్ గవర్నర్ తో చర్చించానని, ఆయన సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ విషయంపై మంత్రి వర్గ సమావేశంలో ప్రత్యేక బృందం ఏర్పాటుపై చర్చిస్తామని కేజ్రీవాల్ తెలిపారు.

  • Loading...

More Telugu News