: సీతారామాంజనేయులు, దేవినేని నుంచి నాకు ప్రాణహాని: వల్లభనేని వంశీ
ఐజీ సీతారామాంజనేయులు, దేవినేని నెహ్రూల నుంచి తనకు ప్రాణహాని ఉందని వల్లభనేని వంశీ మరోసారి ఆరోపించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా తనకు లేఖ రాశారని తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడ నగర డీసీపీ రవిప్రకాశ్ ను కలిసి లేఖ సమర్పించారు.