: పోలీసులకు చిక్కిన ‘ఘరానా దొంగ’ చెంచులక్ష్మి


పలు దొంగతనాలతో సంబంధమున్న ఘరానా మహిళా దొంగ చెంచులక్ష్మి పోలీసుల చేతికి చిక్కింది. ఆమెను రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి 11 తులాల బంగారు ఆభరణాలను వారు స్వాధీనం చేసుకున్నారు. జంట నగరాల పరిధిలో చెంచులక్ష్మిపై 50కి పైగా చోరీ కేసులున్నాయి. రాజేంద్ర నగర్, శంషాబాద్ ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో ఆమె దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News