: సమైక్యవాదులకు నార్కో టెస్టు చేయాలి: డొక్కా
కాంగ్రెస్ పార్టీలోని సమైక్యవాదులపై మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమైన సమైక్యవాదులు ఎవరో తేలాలంటే సీఎం సహా అందరికీ నార్కోటెస్టు చేయాలని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే 50 మంది సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయానికి కట్టుబడతారని ఆయన స్పష్టం చేశారు. వారు కూడా సమైక్యాంధ్ర అంటున్నారని డొక్కా మండిపడ్డారు.