: లోక్ సభ నుంచి కేసీఆర్, విజయశాంతి వాకౌట్
తెలంగాణపై తీర్మానం పెట్టాలంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఎంపీ విజయశాంతి లోక్ సభ కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే తెలంగాణ అంశంపై కేసీఆర్ తీర్మానం ఇచ్చారు. ఇందుకు స్పీకర్ మీరాకుమార్ అంగీకరించలేదు. అయినా కేసీఆర్, విజయశాంతి పట్టువిడవలేదు.
దీంతో సమావేశాలకు ఆటంకం ఏర్పడడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభ సమావేశమైన తర్వాత తెలంగాణపై మాట్లాడేందుకు కేసీఆర్ కు స్పీకర్ మీరాకుమార్ అనుమతించారు. అయితే మిగతా సభ్యులు ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆగ్రహానికి గురైన కేసీఆర్, విజయశాంతి సభ నుంచి వాకౌట్ చేశారు.

- Loading...
More Telugu News
- Loading...