: అత్యాచారాలపై వివాదం రేపిన ఆశామిర్జే వ్యాఖ్యలు
మహారాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఆశామిర్జే చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారాన్నే రేపుతున్నాయి. అత్యాచారానికి మగవారినే అందరూ బాధ్యులను చేస్తున్నారని, ఎక్కువ కేసుల్లో మహిళ కూడా బాధ్యురాలేనంటూ ఆమె పేర్కొన్నారు. ఒంటరిగా సంచరించడం, స్నేహితులు అని నమ్మడం, తెలిసిన వారని వారితో సమయం గడపడం, వేళకాని వేళల్లో ఒంటరిగా ఉండడం వంటి కారణాలు కూడా అత్యాచారానికి కారణాలవుతున్నాయని ఆమె అన్నారు. దీనిపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మహిళలకు దేశంలో స్వేచ్ఛ లేదా? అంటూ ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నాయి.