: కాంగ్రెస్ పోవాలి, బీజేపీ రావాలి, మోడీ ప్రధాని కావాలి: వెంకయ్యనాయుడు


విజయవాడ గాంధీ నగర్లో ‘నమో టీ స్టాల్’ను భారతీయ జనతాపార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అనంతరం తేనీరు కాచి, వడపోసిన వెంకయ్యనాయుడు స్వయంగా అందరికీ 'టీ'ని పంచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ పోవాలి, బీజేపీ రావాలి, నరేంద్ర మోడీ ప్రధాని కావాలని అందరూ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఇటలీ దేశం నుంచి ఇక్కడకు వచ్చి రాజకీయాలు చేయొచ్చు గానీ, భారత్ లో ఒక ప్రాంతం నుంచి వచ్చి వేరొక ప్రాంతంలో నివసిస్తే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. 'దేశాన్ని అమ్మేవారి కన్నా, 'టీ'ని నమ్ముకుని అమ్మేవారే మిన్న' నినాదంతో బీజేపీ ముందుకెళ్తుందని వెంకయ్యనాయుడు చెప్పారు.

  • Loading...

More Telugu News